CM Bhupesh Baghel | గెలిచినప్పుడు చూద్దాం లే ఇప్పటికైతే ‘క్యాండీక్రష్’ ఆడుదాం!.. పార్టీ కీలక సమావేశంలో గేమ్ ఆడిన ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్
ఛత్తీస్‌గఢ్‌లోని అధికార కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్నది. రమణ్ సింగ్ నేతృత్వంలోని 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టంగట్టారు.
- ఎన్నికల్లో ఓటమి తెలిసే రిలాక్స్
- సీఎం ఆటలపై విపక్షాల ఎద్దేవా
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి
- ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత
CM Bhupesh Baghel | హైదరాబాద్, అక్టోబర్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్‌లోని అధికార కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్నది. రమణ్ సింగ్ నేతృత్వంలోని 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. అయితే, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయకపోవడం, రాష్ట్రంలో అభివృద్ధి పడకేయడం వెరసి హస్తం పార్టీపై ప్రస్తుతం ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అంతర్గత కుమ్ములాటలు పార్టీని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను నిర్ణయించడమే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం భూపేశ్ బఘేల్ తన ఫోన్లో ‘క్యాండీక్రష్’ గేమ్ ఆడుతూ కనిపించారు. కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన ఈ భేటీపై ఆయన అంతగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిసే.. సీఎం ‘క్యాండీక్రష్’ గేమ్ ఆడుతూ రిలాక్స్ అయ్యారని విపక్షాలు వ్యంగ్యాస్ర్తాలు సంధించాయి.
గెలుపు అంత తేలిక కాదు
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ‘ప్రజా మేనిఫెస్టో’ పేరిట మేనిఫెస్టోని విడుదల చేసింది. ఐదేండ్లు గడిచినప్పటికీ, అందులోని ప్రధాన హామీలను నెరవేర్చలేదు. పైగా, బొగ్గు రవాణాలో అవినీతి, మద్యం అమ్మకాల్లో అక్రమాలు, మినరల్ ఫౌండేషన్ నిధుల దుర్వినియోగం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో అవకతవకలు.. ఇవన్నీ కాంగ్రెస్ సర్కారుకు తలనొప్పిగా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో హస్తంపార్టీ గెలుపు అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

