Encounter | ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది నక్సలైట్లు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారీ కాంకేర్, మారేడుబాక ప్రాంత అడవుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ నెలలో ఇది రెండో ఎన్కౌంటర్. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), ఐదు బెటాలియన్ల సీఆర్పీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ 229వ బెటాలియన్ బలగాలు నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఇదే జిల్లాలో ఈ నెల 12న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సల్స్‌తోపాటు ఐదుగురు నక్సలైట్లు మరణించారు.