ముంబై సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజ్‌కోట్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు పూనుకుంది. విగ్రహం కూలిన ప్రాంతంలోనే రూ.100 కోట్ల వ్యయంతో ‘శివసృష్టి’ పేరుతో శివాజీ స్మృతివనాన్ని నిర్మించాలని నిర్ణయించింది.
ఇందులో భారీ శివాజీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం కాగా త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఆవిష్కరించిన ఆరు నెలల్లోనే శివాజీ విగ్రహం కూలిపోవడం పట్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.