న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రతిరోజూ మూడు పనులను విధిగా చేయడం వల్ల డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. రోజూ మూడుసార్లు 20 నిమిషాలపాటు వ్యాయామం, సహజ స్వీట్లు (పండ్లు) తీసుకోవడం, ఎండలో ఎక్కువసేపు గడపడంతో షుగర్ అదుపులోకి వస్తున్నట్టు కనుగొన్నారు.
అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనానికి ముందు ఖాళీ కడుపుతో తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలని సూచించారు. అలాగే, మండూకాసన, వజ్రాసన, పవన ముక్తాసన, పశ్చిమోత్తాసనలాంటి యోగాసనాలతో కూడా మంచి ఫలితం ఉంటుందని తేల్చారు. ప్రతిరోజూ ఉదయం ఎండలో నిల్చుంటే శరీరంలో సెరటోనిన్ విడుదలవుతుందని, ఇది వ్యక్తిలో సృజనాత్మకత, ఉత్పాదకతను పెంచడంతోపాటు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుందని గుర్తించారు.