చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. దీంతో పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చన్నీ నిలిచారు. కాగా, రెండు రోజుల క్రితం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ కొత్త సీఎంగా చన్నీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈనేపథ్యంలో ఆయన నేడు ప్రమాణం చేశారు. పంజాబ్‌లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఎంకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
చన్నీ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్ జిల్లాలోని చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అమరీందర్ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
#WATCH Congress leader Rahul Gandhi and Punjab Congress president Navjot Singh Sidhu congratulate Charanjit Singh Channi on becoming the new Punjab CM#Chandigarh pic.twitter.com/QSl0QY9jI8
— ANI (@ANI) September 20, 2021