చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సెటైర్ వేశారు. బాత్రూమ్లో ఉన్న ప్రజలను కూడా కలిసిన తొలి సీఎం ఆయనే అని ఎద్దేవా చేశారు. కొత్త ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారి గట్టి పోటీకి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన పంజాబ్లో విస్తృతంగా పర్యటించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముక్త్సర్లో గురువారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం చన్నీపై విమర్శలు చేశారు.
సీఎం చన్నీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించారు. ‘పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను 24 గంటలు ప్రజలను కలుస్తాను. డ్రాయింగ్రూమ్, హాల్, బాత్రూమ్లోని వ్యక్తులను నేను కలుస్తాను అని చెప్పారు. ప్రపంచ చరిత్రలో బాత్రూమ్లో ఉన్న ప్రజలను కూడా కలిసిన తొలి సీఎం ఆయనే అని భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల చన్నీని ఇసుక దొంగ అని కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్లోని ఇసుక మాఫియాతో ఆయనకు సంబంధాలున్నాయని విమర్శించారు.
#WATCH | Punjab CM Charanjit Singh Channi in the interview says that I meet people 24 hours. I meet people in the drawing-room, hall, bathroom. I think he is the first CM in the history of the world who meet people in the bathroom: Delhi CM Arvind Kejriwal in Muktsar, Punjab pic.twitter.com/UZ5a6Zq4zA
— ANI (@ANI) December 16, 2021