గురువారం 21 జనవరి 2021
National - Dec 30, 2020 , 07:09:18

అడ్డగోలు వైద్యం‌తోనే వైర‌స్‌లో మార్పులు

అడ్డగోలు వైద్యం‌తోనే వైర‌స్‌లో మార్పులు

న్యూఢిల్లీ: కొవిడ్‌–19 వైరస్‌ వేగంగా, భారీగా ఉత్పరి‌వ‌ర్తనం చెంద‌టా‌నికి రోగ అతి నిరో‌ధ‌కత ఒత్తిడే కార‌ణ‌మని ఐసీ‌ఎం‌ఆర్‌ డైరె‌క్టర్‌ బల్‌‌రామ్‌ భార్గవ అన్నారు. న్యాయ‌స‌మ్మతం కాని అడ్డగోలు వైద్య విధా‌నాల వల్ల మనిషి శరీ‌రం‌లోని వైర‌స్‌పై రోగ‌ని‌రో‌ధ‌కత అధి‌కంగా పని‌చే‌స్తుం‌దని.. దాంతో వైరస్‌ తన‌ను‌తాను వేగంగా మార్చు‌కుం‌టుం‌దని చెప్పారు. ఏ వైరస్‌ అయినా కాల‌క్రమంలో కొంత‌వ‌రకు ఉత్పరి‌వ‌ర్తనం చెందు‌తుం‌దని.. కానీ బ్రిట‌న్‌లో బయ‌ట‌ప‌డిన కొత్త రకం కరోనా వైర‌స్‌లో 60 శాతం ఉత్పరి‌వ‌ర్తనం ఉన్నదని చెప్పారు. ఉప‌యోగం లేదు అను‌కునే వైద్య విధా‌నా‌లను కరోనా రోగు‌లపై ఉప‌యో‌గిం‌చ‌క‌పో‌వ‌టమే మంచి‌దని సూచించారు. ప్రస్తుత టీకా‌లు వైర‌స్‌పై శక్తి‌మం‌తంగా పని‌చేసే అవ‌కాశం ఉందన్నారు. కొత్తరకం కరో‌నాతో వ్యాధి తీవ్రత పెరు‌గు‌తున్న దాఖ‌లాలు లే‌వని కేంద్రప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సల‌హా‌దారు కే విజ‌య‌రా‌ఘ‌వన్‌ అన్నారు.


logo