Chandrayaan-3 | బెంగళూరు, జూలై 25: చంద్రయాన్-3 మిషన్ చివరి భూ (ఐదో) కక్ష్య పెంపును విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో మంగళవారం వెల్లడించింది.
ఇది భూమి చుట్టూ చంద్రయాన్-3 తిరిగే చివరి కక్ష్య అని, అనంతరం మిషన్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని వెల్లడించింది. ఆగస్ట్ 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య ట్రాన్స్ల్యూనార్ ఇంజెక్షన్ నిర్వహించి చంద్రయాన్-3ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు ఆ సంస్థ తెలిపింది.