Chandrababu Naidu : ఎన్డీయే ఎంపీల సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, నితిన్ గడ్కరీ, బిహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పవన్ కళ్యాణ్ తదితరులు బలపరిచారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నరేంద్ర మోదీ విజన్ ఉన్న నేతని, ఆయన విధానాలు, కార్యాచరణ మెరుగైన ఫలితాలు ఇస్తాయని ప్రశంసించారు. ఈరోజు భారత్ మోదీ వంటి సరైన నాయకుడి చేతిలో ఉందని, ఇది భారత్కు మంచి అవకాశమని అన్నారు.
ఈ అవకాశాన్ని మనం ఇప్పుడు కోల్పోతే మరెప్పటికీ ఇంతటి అవకాశాన్ని అందుకోలేమని పేర్కొన్నారు. . మోదీ మార్గదర్శకత్వంలో అభివృద్ధిలో భారత్ సరికొత్త శిఖరాలకు చేరుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు.
Read More :
Ayodhya | అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడింది?