Waqf (Amendment) Bill : వక్ఫ్ బిల్లుపై ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అసలు మోదీ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వమేనా అనేది మనం ఆలోచించాలని అన్నారు. ముస్లింల ప్రయోజనాల కోసం వారు ఏ చట్టాన్ని అయినా రూపొందించారా అని ప్రశ్నించారు.ముస్లింల మేలు కోసం ఏ ఒక్క పధకమైనా తీసుకొచ్చారా అని నిలదీశారు.
ఈ ప్రభుత్వం మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ను రద్దు చేసింది. మదర్సాలకు నిధులను నిలిపివేసిందని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వం కాదని ఆజాద్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని విస్మరించి వారు ఎలా ముందుకెళతారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తాము ఎట్టిపరిస్ధితుల్లో మౌనంగా కూర్చోబోమని హెచ్చరించారు.
ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, వారు బిల్లులను ఆమోదించుకున్నా తాము అడ్డుకోలేమని చెప్పారు. అయితే ఏదైనా తప్పు జరిగితే తాము గళమెత్తుతామని స్పష్టం చేశారు. మీరు ముస్లింలను బలహీనపరచాలని కోరుకుంటున్నారని, ఇప్పటికే దేశ విభజనతో మనం అనర్ధాలను చవిచూశామని చెప్పారు. హిందూ ముస్లింలపై తాను రాజకీయాలు చేయాలనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా అంశాల వారీగా రాజకీయాలు ఉండాలని చెప్పారు.
Read More :
Misa Bharti | నిరుద్యోగం, ధరల మంట ఊసెత్తని మోదీ సర్కార్ : ఆర్జేడీ ఎంపీ