అహ్మదాబాద్: గుజరాత్లో చాం దీపురా వైరస్ కలకలం రేపుతున్నది. ఈ వైరస్ కారణంగా ఐదు రోజుల్లో ఆరుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు. వైరస్ బారినపడినవారి సంఖ్య 12కు చేరింది. ఇది అంటువ్యాధి కాదని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని చాందీపురా గ్రామంలో తొలిసారి ఈ వైరస్ను గుర్తించారు. ఇది పిల్లలకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. తీవ్రమైన మెదడు వాపు కూడా కనిపిస్తుంది. దోమలు, ఈగలు వంటివాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది.