Chandigarh Mayoral Polls | క్లిష్ట సమయాల్లో సుప్రీంకోర్ట ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నిక వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదని, రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆప్ కౌన్సెలర్ కుల్దీప్కుమార్ను మేయర్‌గా ప్రకటించింది.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారన్న సర్వోన్న న్యాయస్థానం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందని తెలిపింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆర్వో తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఎనిమిది ఓట్లు చెల్లవంటూ బీజేపీ కౌన్సెలర్‌ను మేయర్‌గా ఆర్వో అనిల్ మసీహ్ ప్రకటించారు. ఆర్వో నిర్ణయంపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సుప్రీంకోర్టు పరిశీలి.. తీర్పును వెలువరించింది. అయితే, తీర్పుపై ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
Thank you SC for saving democracy in these difficult times! #ChandigarhMayorPolls
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 20, 2024