AAP protest: లఖింపూర్ ఖేరీ ఘటనపై నిరసన కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి. ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుపై నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించిన కేంద్రమంత్రి కుమారుడు అశీశ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ ప్రతిపక్ష పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా లఖింపూర్ ఖేరీ ఘటనపై ఆందోళన చేపట్టింది. ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని నిరసనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనకు బాధ్యుడైన మంత్రి కొడుకును అరెస్ట్ చేయాలని, మంత్రిని కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులకు, ఆప్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Chandigarh | Aam Aadmi Party workers protest outside Raj Bhawan over Lakhimpur Kheri violence, police use water cannon to disperse them pic.twitter.com/iPYleYVRUI
— ANI (@ANI) October 6, 2021