దుమ్కా: జార్ఖండ్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం(Mid-Day Meal)లో చనిపోయిన ఊసరవెల్లిని గుర్తించారు. ఆ ఆహారం తిన్న విద్యార్థుల్లో 65 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. టోంగ్రా ఏరియాలో ఉన్న స్కూల్లో ఈ ఘటన జరిగింది. భోజనం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మలేషియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు పిల్లల్ని తీసుకున్నారు. ఆ విద్యార్థుల పరిస్థితి స్టేబుల్గా ఉన్నట్లు బీడీవో అజఫర్ హుస్సేన్ తెలిపారు. భోజనంలో ఊసరవెల్లిని గుర్తించిన కేసు పట్ల విచారణ చేపడుతున్నామని టోంగ్రా పోలీసు ఇంచార్జీ వెల్లడించారు.