న్యూఢిల్లీ, జూలై 10: మోసపూరిత ఫోన్ కాల్స్, మొబైల్ సందేశాలను అరికట్టేందుకు ‘చక్షు యాప్’ను ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రారంభించింది. అనుమానాస్పద, మోసపూరిత ఫోన్ కాల్స్ చేస్తున్న ఫోన్ నంబర్లపై తమకు రిపోర్ట్ చేయడానికి, వాటిపై దర్యాప్తు చేపట్టి.. చర్యలు చేపట్టేందుకు ఈ యాప్ దోహదపడుతుందని ట్రాయ్ ఈ సందర్భంగా వెల్లడించింది. చక్షు అంటే హిందీలో కన్ను అని అర్థం. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ముప్పును తక్షణమే అడ్డుకోవటం ఈ యాప్ లక్ష్యమని ట్రాయ్ తెలిపింది.