న్యూఢిల్లీ: దేశంలో సిజేరియన్ల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరగడమే తప్ప తగ్గడం లేదు. 2005లో సిజేరియన్ ఆపరేషన్లు 8.5 శాతం ఉండగా, 2021 నాటికి 21.5 శాతానికి చేరుకుంది. డబ్బు కోసమే ప్రైవేట్ దవాఖానలు విచ్చలవిడిగా వీటిని చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ప్రసవ నొప్పులు భరించ లేకో, మరో ఇతర కారణాల వల్లో వీటిపై మక్కువ చూపుతున్న మహిళల సంఖ్య కూడా బాగా పెరుగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సిఫార్సు చేసిన స్థాయి కన్నా ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటి నివారణకు ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని, విధాన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రైవేట్ ఆరోగ్య రంగంపై ఆంక్షలు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు.