కోటా : ప్రజల మానసిక ఆరోగ్యం తోడ్పాటు కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టెలి-మానస్ హెల్ప్‌లైన్‌కు (14416 లేదా 1-800-891-4416) ప్రతిరోజూ సుమారుగా 2,500 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. డిసెంబర్ 1, 2002-జూలై 24, 2025 మధ్య కాలంలో 24 లక్షలకు పైగా ఫోన్స్ ఈ హెల్ప్‌లైన్‌కు వచ్చినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
ఈ హెల్ప్‌లైన్‌కు ఆర్థిక సమస్యలకు సంబంధించి 73,377 కాల్స్ రాగా, చదువుల ఒత్తిడికి సంబంధించి 43,346 కాల్స్, ఉద్యోగ సంబంధ సమస్యలపై 22,740 కాల్స్ వచ్చాయి. దీనిపై ఆర్టీఐ కార్యకర్త సుజిత్ స్వామి మాట్లాడుతూ మానసిక అనారోగ్యం తీవ్రమైన జాతీయ సమస్యగా మారిన విషయాన్ని టెలి-మానస్‌కు వస్తున్న స్పందన తెలియజేస్తున్నదన్నారు.