Doctors strike | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో (RG Kar Hospital) 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన (Doctors strike) చేపడుతున్నారు. విధులను బహిష్కరించి బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) పిలుపు మేరకు ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నిరసన చేస్తున్న వైద్యులు తక్షణమే ఆందోళన విరమించాలని కోరింది. వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని (Will form panel for safety measures) హామీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య వృత్తిలో ఉన్నవారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని తెలిపింది. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆందోళన విరమించి వెంటనే విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేసింది.
Also Read..
CM Siddaramaiah: తప్పు చేయలేదు..రాజీనామా చేయను: కర్నాటక సీఎం
TG Rains | ఈ జిల్లాల్లో ఐదు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
DK Shiva Kumar | ముడా కుంభకోణం బీజేపీ కుట్ర.. సీఎం రాజీనామా చేసే ప్రసక్తే లేదు