కేంద్రం ఆస్తుల విక్రయం.. వెతకండి.. అమ్మేద్దాం
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువసగ్గువకు తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది.
- ఈ ఏడాది లక్ష్యానికి దూరంగా ఉన్నాం
- టార్గెట్‌లో 20 శాతం కూడా చేరుకోలే
- మానిటైజ్ లక్ష్యం చేరకుంటే బడ్జెట్లో కోతే
- మంత్రిత్వ శాఖలకు కేంద్రం హెచ్చరికలు
- ఫలహారంగా ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువసగ్గువకు తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. గడిచిన ఎనిమిదేండ్లలో డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి రూ. 3.3 లక్షల కోట్లను సమకూర్చిన బంగారు బాతుల వంటి పీఎస్‌యూలను బలిపీఠంపై పెట్టేందుకు మరోసారి సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్తుల నుంచి అదనపు ఆదాయ మార్గాలేమైనా (మానిటైజేషన్) ఉన్నాయో పరిశీలించాలని ఆయా మంత్రిత్వ శాఖలకు తాజాగా సూచించింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఎకనమిక్ టైవ్ ఓ కథనంలో వెల్లడించింది.

లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే..
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రప్రభుత్వం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించింది. ఎన్ఎంపీ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1.6 లక్షల కోట్లను కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. గడిచిన 7 నెలల్లో రూ.33,443 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మానిటైజ్ చేసింది. దీంతో మానిటైజేషన్ ప్రక్రియలో వెనుకబడిన రైల్వే, టెలికం, పెట్రోలియం తదితర శాఖలపై కేంద్రం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని ఆయా శాఖలకు కేంద్రం సూచించినట్టు ‘ఎకమిక్ టైవ్ వివరించింది.
మానిటైజేషన్ లక్ష్యాలను చేరుకోని శాఖలకు వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధించనున్నట్టు కేంద్రం హెచ్చరించినట్టు కూడా తెలుస్తున్నది. ఏడు నెలలు పూర్తయినప్పటికీ, ఈ ఏడాది మానిటైజేషన్ లక్ష్యాన్ని 20 శాతం కూడా చేరుకోకపోవడంపై కేంద్రం ఆయా శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్ఎంపీ ద్వారా ఈ ఏడాది ఆస్తులను విక్రయించి రూ.1.24 లక్షల కోట్లను ఆర్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొన్నట్టు సమాచారం. అంటే రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.1.24 లక్షల కోట్లకే విక్రయించాలని కేంద్రం భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. కాగా, రైల్వే, టెలికం శాఖలు మానిటైజేషన్ ప్రక్రియను వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

