న్యూఢిల్లీ, మార్చి 9: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-యూజీ గరిష్ఠ వయోపరిమితిని నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) తొలగించింది. ఇప్పటివరకు అన్‌రిజర్వుడు క్యాటగిరీకి 25 ఏండ్లు, రిజర్వుడు క్యాటగిరీకి 30 ఏండ్లుగా గరిష్ఠ వయోపరిమితి ఉండేది. ‘నీట్ యూజీ పరీక్షకు ఎలాంటి గరిష్ఠ వయో పరిమితి లేదు. గతేడాది అక్టోబర్ 21న జరిగిన నాలుగవ ఎన్ఎంసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నాం’ అని ఎన్ఎంసీ తాజా ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నీట్-యూజీ పరీక్షను ఈ నిబంధన మేరకే నిర్వహించనున్నారు. నీట్‌కు వయోపరిమితిపై చాలా అభ్యంతరాలున్నాయి. సుప్రీం కోర్టు, పలు హైకోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ తాజా నిర్ణయం తీసుకొన్నది.