న్యూఢిల్లీ: విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్న వైద్య కోర్సుల గుర్తింపునకు దరఖాస్తు ఫీజును 10వేల డాలర్లుగా (సుమారు రూ.8.7లక్షలు) ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఖరారు చేసింది. ఎన్ఎంసీ ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం, విదేశాలు ఆఫర్ చేస్తున్న మెడికల్ కోర్సుల గుర్తింపునకు సంబంధించి నూతన నిబంధనావళిని ఎన్ఎంసీ తీసుకురాబోతున్నది.
విదేశీ వర్సిటీలు, అక్రెడిటేషన్ ఏజెన్సీలు ఆఫర్ చేస్తున్న మెడికల్ కోర్సుల్ని భారత్ గుర్తించాలంటే దరఖాస్తు ఫీజుగా 10వేల డాలర్లు ఎన్ఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. ‘ఉన్నతమైన వైద్య ప్రమాణాలు నెలకొల్పేందుకు, నాణ్యత గల విదేశీ మెడికల్ కోర్సులకు మాత్రమే గుర్తింపు దక్కాలన్న ఉద్దేశం కోసం గుర్తింపు ఫీజు తీసుకొచ్చాం’ అని ఎన్ఎంసీ తెలిపింది.