Agniveer | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 : విమర్శలు, వివాదాలకు దారితీసిన ‘అగ్నివీర్ పథకం’పై మోదీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అర్హతలు, పారితోషకాలతోపాటు, మరికొంతమంది అగ్నివీర్లను సర్వీస్‌లో కొనసాగించేలామార్పులు ఉండబోతున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పథకం మరింత మెరుగుకు అవసరమైన సవరణలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘25శాతం మందికి ఫుల్‌టైమ్ సర్వీస్ ఇవ్వటం.. క్షేత్రస్థాయిలో ఉన్న డిమా ండ్‌కు సరిపోదు. నాలుగేండ్ల శిక్షణ తర్వాత అగ్నివీర్లలో 50శాతం మందిని ఫుల్‌టైమ్ సర్వీస్‌కు ఎంపికచేయాలని సైన్యం సిఫారసు చేసింది’ అని రక్షణ శాఖ తెలిపింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సైన్యం తన సిఫారసులను అందజేసినట్టు తెలిసింది.
కోల్‌కతా, సెప్టెంబర్ 5: కోల్‌కతా హత్యాచార ఘటనలో వైద్యురాలి తల్లిదండ్రులు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్‌కతా ఆర్జీ కర్ దవాఖాన వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం క్యాండిల్స్‌తో వైద్యురాలి మృతికి నివాళి అర్పించారు. మరోవైపు, ట్రైనీ డాక్టర్ హత్యాచారం జరిగిన మర్నాడే అప్పటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు బయటపడింది. ఆగస్టు 9న డాక్టర్‌పై దారుణం జరగగా, ఆగస్టు 10న ఘోష్ పీడబ్ల్యూడీకి ఓ లేఖ రాశారు. అన్ని డిపార్ట్మెంట్లలోని ఆన్ డ్యూటీ డాక్టర్ల గదుల్లో మరమ్మతులు, ఆధునికీకరణ, పునర్నిర్మాణ పనులను చేయాలని కోరారు.