ముంబై : న్యాయవాది, మాజీ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్తి అరుణ్ సాథె మంగళవారం బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆమెతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులైన అజిత్ ఖడేత్నకర్, సుశీల్ గోదేశ్వర్లతో జడ్జిలుగా ప్రమాణం చేయించారు.
బీజేపీతో సంబంధాలున్న ఆర్తి అరుణ్ సాథె పేరును జడ్జి పదవికి సిఫారసు చేయడాన్ని ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర విపక్షాలు ప్రశ్నించాయి.