చెన్నై: బిల్లుల ఆమోదం విషయంలో తనకు, గవర్నర్లకు గడువు విధించడంపై సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి న్యాయ సలహా కోరడాన్ని వ్యతిరేకించాలని బీజేపీ యేతర రాష్ర్టాల సీఎంలను తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. దీనిపై సమన్వయ, వ్యూహాత్మక న్యాయపోరాటం సాగించాలని 8 రాష్ర్టాల సీఎంలకు లేఖ రాశారు.
తమ రాష్ట్ర గవర్నర్ బిల్లుల ఆమోదంపై జాప్యం చేసిన కేసులో సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ నైతికతతో వ్యవహరించాలన్నారు. ఈ తీర్పును అస్థిరపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధించిందన్నారు.