ఆదివారం 24 జనవరి 2021
National - Dec 04, 2020 , 13:35:11

కోవిడ్ టీకా ధ‌ర‌పై రాష్ట్రాల‌తో చ‌ర్చిస్తున్నాం : ప‌్ర‌ధాని మోదీ

కోవిడ్ టీకా ధ‌ర‌పై రాష్ట్రాల‌తో చ‌ర్చిస్తున్నాం : ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ అఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.  కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీలో మ‌న శాస్త్ర‌వేత్త‌లు విశ్వాసంతో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  అత్యంత చౌకైన‌, సుర‌క్షిత‌మైన టీకాపై ప్ర‌పంచం దృష్టి పెట్టింద‌ని, అందుకే అంద‌రూ ఇండియాపై దృష్టి పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఉన్న విప‌క్ష నేత‌ల‌తో వ‌ర్చువ‌ల్ భేటీలో మాట్లాడిన మోదీ.. వ‌చ్చే కొన్ని వారాల్లో కోవిడ్ టీకా వ‌స్తుంద‌ని నిపుణులు భావిస్తున్న‌ట్లు తెలిపారు.  శాస్త్ర‌వేత్త‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంటేనే.. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌న్నారు.  హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు, వృద్ధులు, వ్యాధి నుంచి తీవ్రంగా బాధ‌ప‌డేవారికి తొలుత టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  వ్యాక్సిన్ ధ‌ర విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కేంద్రం సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని, ప‌బ్లిక్ హెల్త్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ టీకా ధ‌ర‌ను నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంద‌ని మోదీ వెల్ల‌డించారు.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ బృందాలు వ్యాక్సిన్ పంపిణీ గురించి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయ‌ని, వ్యాక్సిన్ పంపిణీలో ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్ మెరుగైన స్థానంలో ఉంద‌న్నారు.  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్‌కు విస్తృత‌మైన నెట్వ‌ర్క్‌, అనుభ‌వం ఉంద‌ని మోదీ తెలిపారు. దాన్ని పూర్తిగా వినియోగించుకుంటామ‌న్నారు. కోవిడ్‌పై అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ సూచ‌ల‌ను లిఖిత‌పూర్వంగా ఇవ్వాలంటూ ప్ర‌ధాని మోదీ ఆయా పార్టీల‌ను కోరారు.  మీరిచ్చే సూచ‌న‌ల‌కు అత్యంత అధిక ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ చెప్పారు. 


logo