నలంద, ఆగస్టు 29: ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యానించగా.. తాజాగా నితీశ్ కుమార్ కుమార్ కూడా అవే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మంగళవారం నలంద ఓపెన్ యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన అనంతరం నితీశ్ మీడియాతో మాట్లాడారు.
మమత వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా.. ‘కేంద్రంలోని బీజేపీ ముందస్తుగా లోక్‌సభ ఎన్నికలకు వెళ్లొచ్చని గత ఏడెనిమిది నెలలుగా నేను చెబుతున్నా. విపక్షాల ఐక్యతపై ఆ పార్టీ భయపడుతున్నది’ అని సమాధానం ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని విపక్ష పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.