న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ సంస్థను కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అంతేకాకుండా, దానిని దేశంలో నిషేధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా 1953లో జెరూసలేంలో స్థాపించిన ఈ సంస్థ భారత్లో యువతను తీవ్రవాదం వైపు నడిచేలా ప్రేరేపిస్తున్నదని, వారిని ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ఒత్తిడి తెస్తున్నదని కేంద్రం ఆరోపించింది.ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి దీనికి ఐసిస్ లాంటి సంస్థలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయని తెలిపింది.