న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: కాలం చెల్లిన వాహనాల్ని తుక్కుగా(స్క్రాపేజ్) మార్చేయటంపై కేంద్రం కొత్త పాలసీని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వాహనాల వయసు ఆధారంగా కాకుండా, వాటి నుంచి వెలువడే కాలుష్యం ఆధారంగా తుక్కుగా మార్చాలన్నది కొత్త పాలసీలో కీలక అంశం.
న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన ఓ సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మాట్లాడుతూ, ‘ 15 సంవత్సరాలు నిండినా కాలుష్యం ఆధారంగా పాలసీ ఉండాలని భావిస్తున్నాం’ అని చెప్పారు.