సంక్షిప్త సమాచారం
చక్కెర ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. కోటా ప్రాతిపదికన వచ్చే ఏడాది మే 31 వరకు 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇస్తున్నట్టు ఆహార మంత్రి త్వ శాఖ శనివా రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
చక్కెర ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. కోటా ప్రాతిపదికన వచ్చే ఏడాది మే 31 వరకు 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇస్తున్నట్టు ఆహార మంత్రి త్వ శాఖ శనివా రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశీయ అవసరాలకు నిల్వలు తగ్గకుండా సహేతుకమైన పరిమితి వరకు ఎగుమతికి అవకాశం కల్పిస్తున్నట్టు పేరొన్నది.
విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనవర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది.
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని సహచరుడు చోటా షకీల్, మరో ముగ్గురిపై ఎన్ఐఏ శనివారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గ్లోబల్ టెర్రరిస్టు నెట్వర్క్, భారతదేశంలో వివిధ ఉగ్రవాద, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న ‘డీ-కంపెనీ’ ముఠాకు సంబంధించిన కేసులో ఈ చార్జిషీట్ వేసినట్టు ఎన్ఐఏ అధికారి ఒకరు పేర్కొన్నారు.
గల్వాన్ ఘటనపై చైనా తన ప్రచారయుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా వ్యూహాత్మక జిన్జియాంగ్-టిబెట్ హైవేపై నిర్మించిన బ్రిడ్జిలకు 2020 జూన్‌లో గల్వాన్ లోయ ఘర్షణలో చనిపోయిన చైనా జవాన్ల పేర్లు పెట్టింది.
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది. ఉత్తరకొరియా శనివారం మరో 4 క్షిపణులను ప్రయోగించింది. వారం వ్యవధిలో 30కి పైగా ప్రయోగించింది. అమెరికా రెండు సూపర్‌సానిక్ బాంబర్లను దక్షిణ కొరియాకు పంపిన నేపథ్యంలో ఉత్తర కొరియా తాజా ప్రయోగానికి దిగడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

