Pension | న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నది. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద పింఛనుపై భరోసా కల్పించబోతున్నది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే చిట్టచివరి జీతంలో 50 శాతం సొమ్మును పింఛనుగా చెల్లించే విషయం పరిశీలనలో ఉంది. ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు విధానాలు, ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సర్దుబాట్లను కూడా పరిశీలించింది. చిట్టచివరి జీతంలో 50 శాతం సొమ్మును పింఛనుగా చెల్లిస్తామనే హామీని ఇవ్వడంపై ఏకాభిప్రాయం వస్తున్నది.