న్యూఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రూ.8 లక్షల కోట్లు రుణాలుగా సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 14.82 లక్షల కోట్లను మార్కెట్ నుంచి అప్పుగా తీసుకోవాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో భాగంగా తొలి ఆరు నెల ల్లో రూ.8 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.