న్యూఢిల్లీ, ఆగస్టు 25: వంట నూనెల ఉత్పత్తిదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. నూనెను ప్యాకింగ్ చేసే సమయంలో పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని పేర్కొంది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద నూనె ద్రవ్యరాశి అంటూ ఇకపై ప్యాక్‌పై ముద్రించవద్దని సూచించింది.
ఉష్ణోగ్రతల సాకుతో కొన్ని తయారీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. తాజా నిబంధనల అమలుకు వచ్చే జనవరి 15ను గడువుగా విధించింది. వంట నూనెలను సాధారణంగా 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాక్ చేయాలి. ఒకవేళ నూనెను 21 డిగ్రీల వద్ద ప్యాక్ చేస్తే, నూనె ద్రవ్యరాశి 919 గ్రాములుగా ఉంటుంది. 60 డిగ్రీల వద్ద ప్యాక్ చేస్తే 892.6 గ్రాముల నూనె మాత్రమే వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద నూనెను ప్యాక్ చేస్తూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.key directives on packing of c