వేములవాడ : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు శ్రీ అప్పాల భీమాశంకర్గారి మరణంపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపం తెలియజేశారు. రాజన్న ఆలయానికి భీమాశంకర్గారు చేసిన సేవలు మరువలేనివి కొనియాడారు.
గతంలో తాను వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించినప్పుడు దగ్గరుండి పూజ కార్యక్రమాలు నిర్వహించారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాజన్న భక్తులకు, వేములవాడ ప్రాంతానికి తీరనిలోటని అన్నారు. భీమాశంకర్ గారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.