మీ జోక్యం వద్దు

- నిపుణులతో చర్చించిన తర్వాతే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించాం
- మీ ప్రమేయంతో అనర్థాలు జరుగవచ్చు
- సుప్రీంకోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ, మే 10: దేశంలో అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని వైద్య నిపుణుల మార్గనిర్దేశంలో, పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించామని.. ఈ విధానంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంతమాత్రం అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న సామర్థ్యాన్ని, విజ్ఞతను విశ్వసించాలని పేర్కొన్నది. వ్యాక్సినేషన్ విధానంలో న్యాయవ్యవస్థ సదుద్దేశంతోనే అయినప్పటికీ తొందరపాటుతో జోక్యం చేసుకుంటే.. అది ఊహించలేని, అవాంఛనీయ పరిణామాలకు దారి తీయవచ్చని హెచ్చరించింది. దేశంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటం, నియంత్రణ అంశాల్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకు ఈ మేరకు కేంద్రం ఆదివారం రాత్రి 218 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ వివరాలు సోమవారం వెల్లడయ్యాయి.
ప్రజలపై భారం కాదు
నిపుణులతో, రాష్ట్రప్రభుత్వాలతో, వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాతనే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించామని కేంద్రం ఈ అఫిడవిట్లో తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ప్రజలందరికీ ఉచితంగా టీకాలను అందజేస్తామని ప్రకటించాయి కాబట్టి.. టీకా కంపెనీలు టీకాలకు ధరలను నిర్ణయించినప్పటికీ.. అది ప్రజలపై భారం కాబోదని కేంద్రం పేర్కొంది. టీకా తయారీ కంపెనీలతో తాము జరిపిన చర్చల కారణంగానే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే ధరతో వ్యాక్సిన్లను అందించటానికి అవి అంగీకరించాయని వెల్లడించింది.
బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం
కరోనా కష్టకాలంలో.. మనుషుల బాధల మీద వ్యాపారం చేస్తే ఎంతమాత్రం సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఔషధాలను బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిని, అక్రమంగా దాచి పెట్టేవారిని ఉపేక్షించబోమని, వారిపై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టంచేశామని సుప్రీంకోర్టుకు తెలిపింది. పోలీసు, శాంతిభద్రతల అంశం రాష్ట్రప్రభుత్వాల చేతుల్లో ఉండే అంశం కాబట్టి.. ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు జారీ చేశామని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

