బీఎస్ఎన్ఎల్ బలి.. సంస్థను నిర్వీర్యం చేసేలా మోదీ సర్కారు చర్యలు
భారత్ సంచార్ నిగవ్ు లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను నిర్వీర్యం చేసి, సమూలంగా భూస్థాపితం చేసే దిశగా కేంద్రంలోని మోదీ సర్కారు యత్నిస్తున్నది.
- గాలికొదిలేసిన మోదీ సర్కారు
- బకాయిల చెల్లింపులో నాన్చివేత
- ఉద్యోగులపై వేధింపుల పర్వం
- ఐదేండ్లుగా వేతన సవరణ లేదు
- వైఫల్యాలను ఉద్యోగులపై తోసే కుట్ర
- ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడానికే
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారత్ సంచార్ నిగవ్ు లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను నిర్వీర్యం చేసి, సమూలంగా భూస్థాపితం చేసే దిశగా కేంద్రంలోని మోదీ సర్కారు యత్నిస్తున్నది. రూ.30 వేల కోట్ల బకాయిలను ఏండ్లకేండ్లు చెల్లించకుండా జాప్యం చేస్తూ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన అనేక టెండర్లను ఉద్దేశపూర్వకంగా రద్దు చేసింది. ఉద్యోగుల వేతన సవరణ విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తూ.. సంస్థ నష్టాల పాలు కావటానికి ఉద్యోగులే కారణమంటూ కొత్త నాటకానికి తెరతీసింది. ఇలా బీఎస్ఎన్ఎల్ను బలిపశువును చేస్తూ ప్రైవేటురంగ టెలికం సంస్థలకు కేంద్రం మేలు చేకూరుస్తున్నది.
‘4జీ’ని దూరం చేసి..
అక్టోబర్ 1, 2000న బీఎస్ఎన్ఎల్ కార్పొరేషన్‌గా మారింది. 2009 వరకూ ఏటా పది వేల కోట్ల వంతున లాభాలు గడిస్తూ వచ్చింది. దేశీయ టెలికం రంగంలో ప్రైవేటు ప్లేయర్ల అరంగేట్రంతో బీఎస్ఎన్ఎల్ వాటా తగ్గడం మొదలైంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో 3జీ సేవలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటికే వినియోగదారులు ప్రైవేటు ఆపరేటర్లకు మారడం మొదలెట్టారు. ఇక, మోదీ హయాంలో కంపెనీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. 2016 అక్టోబర్‌లో నిర్వహించిన 4జీ స్పెక్ట్రవ్ు వేలంలో బీఎస్ఎన్ఎల్ను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా పక్కనపెట్టి, ప్రైవేట్ ఆపరేటర్లను ప్రోత్సహించింది. 4జీ సేవలు అందుబాటులో లేకపోవటం వల్ల బీఎన్‌ఎస్‌ఎల్ మార్కెట్ షేర్, రెవెన్యూ మరింత దెబ్బతిన్నాయి. 4జీతో సంస్థకు ఎలాంటి ప్రయోజనం లేదని నీతిఆయోగ్‌తో చెప్పించింది. ఇక, 5జీ సేవలను ఇప్పటికే పలు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు ట్రయల్ బేసిక్‌గా అందిస్తుండగా, 4జీ సేవలను కూడా పూర్తిస్థాయిలో బీఎస్ఎన్ఎల్ అందించలేకపోతున్నది. దీనికి కారణం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ (డీఓటీ) పెడుతున్న పలు నిబంధనలే. ఇక, కేంద్రం పెట్టిన కొర్రీలతో వేతన సవరణ వ్యవహారం కూడా 2017 నుంచి పెండింగ్‌లోనే ఉన్నది.
కేంద్రం వివక్ష
బీఎస్ఎన్ఎల్పై కేంద్రం వివక్ష చూపుతున్నది. సంస్థ నష్టాలకు ఉద్యోగులే బాధ్యులంటూ నిందలు మోపుతున్నది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించటానికి చర్యలు తీసుకుంటున్నది. డీఓటీ వైఖరితో బీఎస్ఎన్ఎల్ 4జీ స్పెక్ట్రవ్ును కోల్పోయింది. అనేక ‘సౌకర్యాల’ టెండర్లు రద్దయ్యాయి. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్.. వేల కోట్లు నెలల తరబడి విడుదల కాలేదు. వేతన సవరణ వ్యవహారాన్ని ప్రభుత్వం ఐదేండ్లుగా పట్టించుకోవటం లేదు
-బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్, యూనియన్ అధ్యక్షుడు అనిమీశ్ మిత్రా
ఇది అమానుషం
జీవన వ్యయం పెరుగుతున్నది. మోదీ హయాంలో రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో వేతన సవరణపై మౌనంగా ఉండటం వల్ల కలిగే నష్టాన్ని, పెన్షనర్ల ప్రయోజనాలను కేంద్రం ఆలోచించకపోవటం అమానుషం.
స్వపన్ చక్రవర్తి
-బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ కార్యవర్గసభ్యుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 4G
- Animesh Mitra
- bsnl
- Modi Govt
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

