తమిళనాడు : తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు, గురువారం(ఏప్రిల్ 23) పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 17.69 శాతం పోలింగ్ నమోదయింది. ఉదయాన్నే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీఎంకే తరఫున పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్ చెన్నైలో అతడి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూరు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
అలాగే సినీ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్, అతడి కూతురు శృతి హాసన్ సైతం చైన్నైలో ఓటు వేశారు. అలాగే చెన్నైలోని స్టెల్లా మేరీస్ స్కూల్లో సూపర్ స్టార్, తళైవ రజనీకాంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి సాలెం ప్రాంతంలో ఓటు వేశారు.