Uttar Pradesh | లక్నో : ఓ భూ వివాదం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తి బైక్‌లో తుపాకీ పెట్టి.. అతడిని అరెస్టు చేసేందుకు యత్నించారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌కు చెందిన అశోక్ త్యాగికి సంబంధించి ఓ భూవివాదం కేసు నడుస్తోంది. ఈ కేసులో అతడి కుమారుడు అంకిత్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో అంకిత్ బైక్‌లో పోలీసులు ఓ తుపాకీ పెట్టారు. కాసేపటి తర్వాత బైక్‌లో ఉన్న గన్ను చూపిస్తూ.. అంకిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంకిత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే నెపంతో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై అశోక్ త్యాగి భార్య రాఖీ తీవ్రంగా మండిపడింది. కావాలనే బైక్‌లో తుపాకీ పెట్టి, తమ కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆమె వాపోయింది. ఈ వ్యవహారాన్ని మీరట్ ఎస్పీ దేహత్ కమలేశ్ బహదూర్ దృష్టికి బాధిత కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. అయితే అంకిత్ బైక్‌లో ఇద్దరు పోలీసులు కలిసి గన్ పెట్టినట్లు బాధితులు తెలిపారు.
In UP’s Meerut, a family alleged two cops from the local police station planted a gun in the house and later arrested a youth Ankit Tyagi under Arms Act. The family has produced CCTV footage as evidence to corroborate their claims.
First video is of a cop allegedly planting… pic.twitter.com/UM6OzaCkPq
— Piyush Rai (@Benarasiyaa) September 27, 2023