Akhanda 2 | ‘అఖండ 2’ థియేటర్లలో ఆధ్యాత్మిక ఉత్సాహం.. క్లైమాక్స్ సీన్ చూసి మహిళకు పూనకం, వీడియో వైరల్
Akhanda 2 |నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’ థియేటర్లలో అసాధారణ స్పందనను సొంతం చేసుకుంటోంది. తొలి భాగం ‘అఖండ’ సృష్టించిన భక్తి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శక్తివంతంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ సీక్వెల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Akhanda 2 |నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’ థియేటర్లలో అసాధారణ స్పందనను సొంతం చేసుకుంటోంది. తొలి భాగం ‘అఖండ’ సృష్టించిన భక్తి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శక్తివంతంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ సీక్వెల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బాలయ్య అఘోర అవతారంలో కనిపించే సన్నివేశాలు, శైవ తత్వాన్ని ప్రతిబింబించే డైలాగులు, తమన్ అందించిన పవర్ఫుల్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ మొదలవ్వడం విశేషం.
హిందూ సంఘాలు, పలువురు స్వామీజీలు కూడా ‘అఖండ 2’పై అభినందనలు తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. శివ భక్తి, ధర్మ పరిరక్షణను దర్శకుడు బోయపాటి బలంగా ఆవిష్కరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. థియేటర్లలో ‘అఖండ 2’ ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. స్క్రీన్‌పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం, విజిల్స్ వేయడం, “జై బాలయ్య” నినాదాలతో థియేటర్ మార్మోగుతోంది. క్లైమాక్స్‌కు దగ్గరయ్యే కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ స్తోత్రాలు ప్రేక్షకులను పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు థియేటర్ల వద్ద పూజలు, అభిషేకాలు చేయడం కూడా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ‘అఖండ 2’కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలోని క్లైమాక్స్‌లో బాలయ్య శివ తాండవం చేస్తూ శత్రువులను సంహరించే సన్నివేశం హైలైట్‌గా నిలవగా, అదే సమయంలో ఒక థియేటర్లో ఉన్న ఓ మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై పూనకం వచ్చినట్టుగా ఊగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న పూర్తి వివరాలు తెలియకపోయినా, కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వచ్చిన ఆ మహిళ క్లైమాక్స్ సీన్లో పూర్తిగా లీనమైపోయిందని తెలుస్తోంది.వైరల్ వీడియోలో ఆ మహిళ చేతులు ఊపుతూ, శరీరం కంపిస్తూ కనిపించగా, పక్కనే ఉన్న ఆమె భర్త వెంటనే స్పందించి ఆమెను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. థియేటర్లో ఉన్న ఇతర ప్రేక్షకులు కూడా కొంతసేపు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నిలిచిపోయారు. ఈ వీడియో బయటకు రావడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
అఖండ 2 క్లైమాక్స్ లో శివ తాండవ సన్నివేశానికి పూనకం వచ్చి ఉద్వేగానికి గురి అవుతున్న మహిళ#Akhanda2 pic.twitter.com/0S2YrNNlqG
— Telugu360 (@Telugu360) December 14, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

