దేవాలయ ఉద్యోగిపై దాడి అమానుషం
పెళ్లి బృందం ఆలయానికి వచ్చి తమ సంప్రదాయాన్ని అనుసరించి వేడుకలు చేసుకుంటుండగా ఫౌండర్ ట్రస్టీ పెళ్లి బృందంపై దాడిచేసి, దేవస్థాన ఉద్యోగిపై దాడి.
- ఫౌండర్ ట్రస్టీపై అర్చక జేఏసీ ఆగ్రహం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): పెళ్లి బృందం ఆలయానికి వచ్చి తమ సంప్రదాయాన్ని అనుసరించి వేడుకలు చేసుకుంటుండగా ఫౌండర్ ట్రస్టీ పెళ్లి బృందంపై దాడిచేసి, దేవస్థాన ఉద్యోగిపై దాడికి పాల్పడటాన్ని అర్చక ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు గంగు ఉపేంద్రశర్మ, డీవీఆర్ శర్మ, కాండూరి కృష్ణమాచారి, పరాశరం రవీంద్రాచారి, చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ఆలయ ఉద్యోగులపై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఉద్యోగులకు న్యాయం జరిగేదాకా దేవాదాయ శాఖలోని ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని సూచించారు. ఆలయ అర్చక ఉద్యోగుల పరిరక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

