Bandra Terminus | ముంబై (Mumbai)లోని బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట (Stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యూపీలోని గోరఖ్‌పూర్ వెళ్లే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (Bandra-Gorakhpur Antyodaya Express) ప్లాట్‌ఫాంపైకి వస్తుండగా, అందులో ఎక్కడానికి పెద్దయెత్తున ప్రయాణికులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అయితే, తొక్కిసలాట ఘటనకు ముందు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుల రద్దీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఇసుకేస్తే రాలనంత జనంతో ప్లాట్‌ఫామ్ మొత్తం కిక్కిరిపోయింది. రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు కనిపించింది.
CCTV footage reveals details of the Bandra stampede incident, resulting in nine injuries, including two victims in critical condition
Via: @mid_day#Mumbai #Bandra #BandraTerminus #Stampede https://t.co/0a80yXCmXF pic.twitter.com/09NBhj0sNh
— Siraj Noorani (@sirajnoorani) October 28, 2024
దీపావళి, ఛాత్ పండుగల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లడానికి పెద్దయెత్తున ప్రయాణికులు బాంద్రా స్టేషన్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం వందలాది మంది ప్రయాణికులు బాంద్రా టెర్మినస్‌లోని ప్లాట్ ఫామ్ నంబర్ 1 పై వేచిచూస్తుండగా.. బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లాల్సిన నంబర్ 22921 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫామ్ మీదికి వచ్చింది. దాంతో జనం ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
त्योहार के समय हर किसी का सपना होता है घर पहुंचना।#Bandra स्टेशन पर आज भीड़ और भगदड़ से कई लोग घायल हुए।
रेल मंत्री जी से अनुरोध है कि त्योहारों में स्पेशल ट्रेन चलाकर यात्रियों की सुरक्षा सुनिश्चित करें।#BandraTerminus #SafeTravels pic.twitter.com/zSHMX3fThU— Shelesh Bamniya (@SheleshBamniya) October 27, 2024
Complete failure of Narendra Modi Govt and Railway ministry
A stampede at Platform No. 1, Bandra Terminus, occurred at 5: 10 a.m. on October 27 as heavy passenger rush led to overcrowding. Train No. 22921, the Bandra-Gorakhpur Expresspic.twitter.com/83tTNOndf4
— Pritesh Shah (@priteshshah_) October 27, 2024
Also Read..
Gaganyaan Mission | 2025లో కాదు.. గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో కీలక అప్డేట్
Bomb Threat | తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు
Bomb Threats | వరుస బాంబు బెదిరింపులతో అప్రమత్తం.. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంపు