న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశ, విదేశాల్లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లే విద్యార్థులకు పరీక్షల విషయంలో వెసులుబాటు కల్పిస్తూ సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలు లేదా ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్లో పాల్గొనే 10, 12వ తరగతి విద్యార్థులకు 2024 బోర్డు పరీక్షల షెడ్యూల్ తర్వాతి తేదీల్లో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నది. ఈ విధానం క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు అటు క్రీడాపరంగా, ఇటు విద్యాపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.