శుక్రవారం 10 జూలై 2020
National - May 27, 2020 , 20:16:40

ఎక్క‌డి వాళ్లకు అక్క‌డే సీబీఎస్ఈ పరీక్షలు: ‌కేంద్రం

ఎక్క‌డి వాళ్లకు అక్క‌డే సీబీఎస్ఈ పరీక్షలు: ‌కేంద్రం

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా తాము చ‌దువుకుంటున్న ప్రాంతం నుంచి సొంత ఊళ్లు, సొంత రాష్ట్రాల‌కు వెళ్లిన విద్యార్థులు అక్క‌డే ప‌రీక్ష‌లు రాసుకునేందుకు అనుతించింది. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిన విద్యార్థులు ఎవ‌రూ తాము చ‌దువుతున్న పాఠ‌శాల‌ల‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని, వారు ప్ర‌స్తుతం ఎక్క‌డైతే ఉన్నారో అక్క‌డే ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. 

స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిన విద్యార్థులంద‌రూ తాము ప్ర‌స్తుతం ఉన్న చిరునామా వివ‌రాల‌ను వారివారి పాఠ‌శాల‌ల‌కు తెలియ‌జేయాల‌ని కేంద్ర‌మంత్రి పోఖ్రియాల్ కోరారు. విద్యార్థులు ఇచ్చే స‌మాచారం ఆధారంగా పాఠ‌శాల యాజ‌మాన్యాలు వారికి ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తాయ‌ని మంత్రి చెప్పారు. విద్యార్థుల‌కు కేటాయించిన ప‌రీక్షా కేంద్రాల వివ‌రాల‌ను జూన్ మొద‌టి వారంక‌ల్లా వారికి తెలియ‌జేస్తామ‌ని మంత్రి పోఖ్రియాల్ వెల్ల‌డించారు.  


logo