న్యూఢిల్లీ : అఫిలియేషన్ బై-లాస్‌ను సీబీఎస్ఈ సవరించింది. దీని ప్రకారం, పాఠశాల భవనంలో మొత్తం బిల్టప్ కార్పెట్ ఏరియా ఆధారంగా సెక్షన్ల సంఖ్యను గరిష్ఠంగా నిర్ణయించి, అనుమతి ఇస్తుంది. సెకండరీ, సీనియర్ సెకండరీ లెవెల్స్‌లో సమాన సంఖ్యలో సెక్షన్లను నిర్వహించేందుకు పాఠశాలలను అనుమతించాలని నిర్ణయించింది.
సీబీఎస్ఈ కార్యదర్శి హిమాంశు గుప్తా మాట్లాడుతూ, సెక్షన్, విద్యార్థుల నిష్పత్తి 1:40కి అనుగుణంగా విద్యార్థులను చేర్చుకోవడంలో పాఠశాలలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భూమిని బట్టి సెక్షన్ల సంఖ్యపై పరిమితి ఉండటమే కారణమని తెలిపారు.