న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ 2024-25 విద్యా సంవత్సరానికి 3 నుంచి 6 తరగతులకు నూతన సిలబస్‌ను, టెక్స్బుక్స్ను విడుదల చేస్తుందని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. ఇతర తరగతుల సిలబస్, పాఠ్య పుస్తకాల్లో ఈ విద్యా సంవత్సరానికి ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తన అనుబంధ పాఠశాలలకు సమాచారాన్ని పంపినట్లు చెప్పారు. 3, 6 తరగతులకు బ్రిడ్జ్ కోర్సులను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీఈఆర్టీ నుంచి ఇవి వచ్చిన తర్వాత అన్ని పాఠశాలలకు ఆన్లైన్ ద్వారా అందజేయనున్నట్లు చెప్పారు.