CBSE | సీబీఎస్ఈలో త్రిభాషా విధానం.. 9వ తరగతికి తప్పనిసరి.. జూలై 1 నుంచి అమలు
CBSE : సీబీఎస్ఈ విద్యా విధానంలో భాషా విభాగానికి సంబంధించి కీలక మార్పులు జరగనున్నాయి. సీబీఎస్ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేయనుంది.
CBSE : సీబీఎస్ఈ విద్యా విధానంలో భాషా విభాగానికి సంబంధించి కీలక మార్పులు జరగనున్నాయి. సీబీఎస్ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేయనుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు త్రిభాష తప్పనిసరి చేయనుంది. అంటే, ఇకపై విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. అందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందే. వచ్చే జూలై 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది. సీబీఎస్ఈ బోధించే అన్ని విద్యాసంస్తల్లో ఈ విధానం అమలుకానుంది.
అయితే, పదో తరగతికి మాత్రం ప్రస్తుతానికి త్రిభాషా విధానాన్ని అమలు చేయడం లేదు. వచ్చే ఏడాది నుంచి పదో తరగతికి త్రిభాషా విధానం అమలవుతుంది. అంటే, ఇప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇకపై కంటిన్యూగా త్రిభాషా విధానాన్ని అనుసరించాలి. ఇందుకోసం ఎన్సీఈఆర్టీ సిలబస్ సిద్ధంగా ఉంది. విద్యార్థులు మూడు భాషల్ని ఆర్1, ఆర్2, ఆర్3గా చదువుకోవాలి. రెండు భారతీయ భాషలు ఇందులో తప్పనిసరి. అవసరమైతే మూడో భారతీయ భాషను ఎంచుకోవచ్చు. లేదా ఏదైనా ఒక విదేశీ భాషను కూడా నేర్చుకోవచ్చు. అలాగే, నాలుగో భాషగా కూడా విదేశీ భాషను ఎంచుకోవచ్చు.
The Central Board of Secondary Education (CBSE) has made the study of three languages compulsory for students from Class IX beginning July 1, 2026, while clarifying that there will be no Board examination for the third language (R3) in Class X.
In a circular issued on May 15,… pic.twitter.com/D1jlOPbqXQ
— ANI (@ANI) May 16, 2026
మరోవైపు పదో తరగతి విద్యార్థులకు ఈ విషయంలో సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. పదో తరగతిలో మూడో భాషకు బోర్డు ఎగ్జామ్ ఉండదు. అయితే, మూడో భాషకు సంబంధించిన మార్కులు తుది మార్కుల జాబితాలో ఉంటాయి. ఎందుకంటే ఈ పరీక్షల్ని స్కూల్లోనే ఇంటర్నల్గా నిర్వహిస్తారు. ఏడాదంతా నిర్వహించిన పరీక్షల్లో మార్కుల ఆధారంగా, తుది జాబితాలో వీటిని ప్రచురిస్తారు. బోర్డ్ ఎగ్జామ్ మాత్రం ఉండదు. అలాగే, పదో తరగతిలో మూడో భాషతో సంబంధం లేకుండా విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మూడో భాష ఆధారంగా ఏ విద్యార్థినీ పరీక్షకు నిరాకరించకూడదు.
పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి సంబంధించి గత ఏప్రిల్లోనే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయితే, వారిపై ఒత్తిడి పెంచడం ఇష్టం లేక, నెమ్మదిగా మూడో భాషను ప్రవేశపెట్టాలని బోర్డు భావించింది. అందుకే, వచ్చే జూలై నుంచి మాత్రమే మూడో భాష అమలు చేయాలని నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

