న్యూఢిల్లీ : దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎంత కాంట్రవర్సీ అవుతుందో చూస్తున్నాం. ఇలాంటి టైమ్ లో సీబీఎస్ఈ రివాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్ అయిందంటూ వస్తున్న వార్తలు మరింత దుమారం రేపుతున్నాయి. ఓ 19 ఏండ్ల కుర్రాడు చేసిన పనికి స్టూడెంట్లు తెగ టెన్షన్ పడ్డారు. చివరకు సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ ఇచ్చుకుంది. అసలే సీబీఎస్ఈ ఎగ్జామ్ రీవాల్యుయేషన్ పోర్టల్ సరిగ్గా పనిచేయట్లేదు. పోర్టల్ క్రాష్ కావడం, ఆన్సర్ షీట్లు బ్లర్ కావడం లాంటివి స్టూడెంట్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో 19 ఏండ్ల రిసెర్చర్ నిసర్గ అధికారి తాను సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌ను హ్యాక్ చేసినట్టు ప్రకటించాడు.
ఫిబ్రవరిలోనే ఈ విషయంపై సీబీఎస్ఈని తాను హెచ్చరించానన్నాడు. ఈ విషయంపై సర్వత్రా ఆందోళన రేకెత్తడంతో సీబీఎస్ఈ తాజాగా స్పందించింది. హ్యాకర్ టార్గెట్ చేసింది డమ్మీ పోర్టల్ అని.. రీవాల్యుయేషన్ కోసం వాడిన అసలు పోర్టల్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదని స్పష్టం చేసింది. కేవలం టెస్టింగ్ ప్లాట్ ఫామ్‌లో ఉన్న శాంపిల్ డాటాను నిసర్గ ఎక్స్‌లో పోస్టు చేశాడని.. అందులో ఎలాంటి అధికారిక సమాచారం లేదని బోర్డు చెప్పింది. అయినా సరే ఈ విషయంపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.