CBSE 10th Result : దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూసిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రిజల్ట్స్ కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in లో చెక్ చేసుకుని ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేసి రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి డీటైల్స్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
అలాగే, డీజీ లాకర్ ద్వారా కూడా ఫలితాల్ని తెలుసుకునే వీలుంది. వీటి ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్లో స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి రెండు విడతల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడు వెలువడినవి మొదటి విడత ఫలితాలు. ఈ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగాయి. రెండో విడత పరీక్షలు మే నెలలో జరుగుతాయి. మొదటి విడతలో దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 93.70 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
వీరిలో 1.47 లక్షల మంది కంపార్ట్మెంట్ కేటగిరిలో పాసయ్యారు. 2.20 లక్షల మందికిపైగా విద్యార్థులు 90 శాతంపైగా స్కోర్లు సాధించడం విశేషం. అలాగే, 55,000 మందికిపైగా విద్యార్థులు 95 శాతం స్కోర్ సాధించారు. బాలురుకంటే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. బాలికల పాస్ పర్సంటేజీ 94.99 శాతం ఉండటం విశేషం.