న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తి చిదంబరంపై మరో అవినీతి కేసును సీబీఐ నమోదు చేసింది. డియాజియో స్కాట్లాండ్ కంపెనీ ఇంపోర్టెడ్ డ్యూటీ ఫ్రీ జానీ వాకర్ విస్కీని అమ్మడంపై నిషేధం నుంచి కార్తి ఉపశమనం కల్పించారని సీబీఐ ఆరోపించింది.
కార్తి, ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కర రామన్ నియంత్రణలో ఉన్న అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డియాజియో స్కాట్లాండ్, సెక్వోయియా క్యాపిటల్స్ కంపెనీల నుంచి అనుమానాస్పదంగా 15 వేల డాలర్ల చెల్లింపులు జరిగినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ ఆరోపించింది. ఇంపోర్టెడ్ డ్యూటీ ఫ్రీ ఉత్పత్తులను భారత దేశంలో అమ్మడంపై ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గుత్తాధిపత్యం ఉంది.