చెన్నై, జనవరి 12: ‘కరూర్ తొక్కిసలాట’ ఘటనకు తన పార్టీ గానీ, దాని కార్యకర్తలు గానీ బాధ్యులు కారని టీవీకే చీఫ్, తమిళ నటుడు విజయ్ సీబీఐ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ అధికారులు విజయ్ను సోమవారం ఆరు గంటలకుపైగా విచారించారు.
తన ఉనికి అక్కడ మరింత గందరగోళం, అలజడిని సృష్టించవచ్చునని భావించి, తాను ఆ ప్రదేశం నుంచి వెంటనే వెళ్లిపోయానని విజయ్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విజయ్ వైపు నుంచి గణనీయమైన జాప్యం వల్లే తొక్కిసలాట జరిగిందని గతంలో పేర్కొన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలతో.. తాజా విచారణను సీబీఐ విశ్లేషించనున్నది.