న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ న్యాయస్థానాలకు దాఖలు చేసే పిటిషన్లు, అభ్యర్థనల్లో తనను తాను ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’గా పేర్కొనడంపై సుప్రీం కోర్టు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకు మీరు దాఖలు చేసే పిటిషన్లలో ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ గా పేర్కొంటున్నారు? మీరు కేంద్రానికి గాని, గణతంత్ర రాజ్యానికి గాని ప్రాతినిధ్యం వహించడం లేదు. మీరు ఐక్య భారత్కు ప్రతినిధి కాదు. అందువల్ల ఇక నుంచి యూనియన్ ఆఫ్ ఇండియా అని మీ పిటిషన్లను దాఖలు చేయలేరని ధర్మాసనం ఆదేశించింది. అన్యాయాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో దర్యాప్తు చేయడానికి సీబీఐ అనే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పడిందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పిటిషన్లో పేర్కొన్న ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ పదాలను తొలగించాలని కోర్టు ఆదేశించగా, దానికి ఏఎస్జీ ఐశ్యర్య భాటి అంగీకరించారు.